‘వార్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

War2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టించనుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌కు సిద్ధం. ఎప్పుడు స్ట్రీమింగ్? పూర్తి వివరాలు చూద్దాం!
యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘వార్ 2’ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోతో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హిందీలో డీసెంట్ కలెక్షన్స్ సాధించినా, తెలుగు వెర్షన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది.
థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల్లో, అంటే సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ‘వార్ 1’ అమెజాన్ ప్రైమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ కాగా, ‘వార్ 2’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి.



