నరసింహ సీక్వెల్‌కు రజినీ గ్రీన్ సిగ్నల్!

సూపర్‌స్టార్ రజినీకాంత్ నరసింహ సీక్వెల్‌కు అంగీకారం తెలిపారు. నీలాంబరి అనే టైటిల్ లాక్ అయింది. రజినీ పుట్టినరోజు సందర్భంగా నరసింహ రీ-రిలీజ్ కానుంది. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగారు.
కే.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ చిత్రం రజినీకాంత్ కెరీర్‌లో భారీ విజయం సాధించింది. తమిళంలో రజినీ పుట్టినరోజైన డిసెంబర్ 12న ఈ చిత్రం గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన అరగంట పొడవున్న స్పెషల్ వీడియోలో రజినీ స్వయంగా పాల్గొని సంచలన ప్రకటన చేశారు.
నరసింహ సీక్వెల్‌కు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, టైటిల్ నీలాంబరిగా లాక్ అయిందని తెలిపారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మొదటి భాగంలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో కనిపించగా, సీక్వెల్‌లో ఆమె మళ్లీ నటిస్తారా లేక కొత్త ఆలోచనలు ఉన్నాయా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. మొదటి భాగం రీ-రిలీజ్‌తోనే ఈ అప్‌డేట్ రావడం రజినీ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తుంది.



