ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా

తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. తెల్లవారుజామున నిర్మలా సీతారామన్ కుటుంబ సభ్యులతో కలిసి అభిషేక సేవలో పాల్గొనారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలకగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి తీర్థప్రసాదాలను అందజేశారు.



