Monkey: మీరే నా పార్టీ చేసుకునేది.. మేము కూడా చేసుకుంటాం..!

సాధరణంగా ఎవరైనా అల్లరి చెస్తే కోతితో పోల్చుతారు. కోతికోతిగా చేస్తున్నావ్ అంటారు. ఏకంగా కోతికే కిక్కుఎక్కి అల్లరల్లరి చేసింది. ఇది చూసిన జనం కాసేపు ఎంజాయ్ చేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. చిన్నా,పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేశారు.
న్యూయర్ వేడుకల్లో మునిగిపోయారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఇలాంటి సంఘటనే కనబడింది. గుంజేడు ముసలమ్మ జాతర ప్రాంగణంలో మందుబాబులు , స్నేహితులు, కుటుంబ సభ్యులు.. అంతా దావత్ చేసుకున్నారు. వారి వేడుకల అనంతరం.. అక్కడ థంసప్ వదిలేశారు.
అయితే ఓ వానరం కూడా అదే బాటలో సాగింది. మీరే నా పార్టీ చేసుకునేది.. నేను కూడా చేసుకుంటా అన్నట్టు ఎంజాయ్ చేసింది. ఓ వానరం థంసప్ తాగుతూ ఎంజాయ్ చేసింది. థంసప్ తాగిన వానరకు కిక్కు ఎక్కిందో ఏమో.. కోతి బుద్ది చూపించింది. తిక్కతిక్కగా చేస్తూ గంతులు వేసింది. అల్లరి చేసింది. వేడుకల్లో డావత్ కు వచ్చిన వారికి కోతులు కొంత ఇబ్బంది కలిగించినా.. అటుగా వెళ్ళే వాళ్ళంతా వింతగా చూస్తూ ఇది చూసిన జనం కాసేపు ఎంటర్ టైన్ అయ్యారు.