సినిమా
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బాల నటుడు రేవంత్‌కు క్రేజ్

Sankranthiki Vasthunam: ప్రసార మాధ్యమాలు హీరోలను జీరోలు చేయడమే కాదు.. జీరోలను హీరోలుగా కూడా చేస్తాయి. సోషల్ మీడియా చేతిలో పడితే.. కథ మామూలుగా ఉండదు. వ్యూస్ కోసం ఏదైనా చేస్తారు యూట్యూబర్స్. సెలబ్రిటీలను ఫాలో అవుతూ.. వారికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బాల నటుడుగా నటించిన.. రేవంత్‌కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఇక బయట బుల్లి రాజు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు. బుల్లి రాజు బయట కనిపిస్తే చాలు.. బుగ్గలు గిల్లేసి, సెల్ఫీలు అంటూ రచ్చ రచ్చ చేసేలా ఉన్నారు. బుల్లి రాజుకు జనాలు ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తున్నారు. ఈ మితిమీరిన స్టార్‌డమ్‌ను ఆ పసివాడు ఎలా డీల్ చేసి ఎదుగుతాడో కానీ.. ఇదేదో ప్రమాదంలో పడే వ్యవహారంలాగా ఉంది.