జాతియం

NIA చేతికి పహల్‌గామ్ ఉగ్రదాడి కేసు

పహల్‌గామ్ ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి NIA అధికారికంగా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణను చేపట్టింది. కేంద్ర హోం శాఖ ఆదేశంతో NIA కేసు విచారణను స్వీకరించింది. ఈ నెల 22న జరిగిన పహల్‌గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. ఘటనా స్థలంలో NIA టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఈ బృందంలో ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీకి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీ ఉన్నారు. ఉగ్రదాడిని చూసిన సాక్షులను అధికారులు ప్రశ్నించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button