తెలంగాణ
Eatala Rajendar: ప్రభుత్వం వెంటనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలి

Eatala Rajendar: ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు అవుతున్న మౌలిక వసతులను కల్పించడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా అభివృద్ధిపై ఒక్క రివ్యూ కూడా మంత్రులు నిర్వహించలేదని ఈటల రాజేందర్ విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేదు, లిఫ్టులు లేవన్నారు. నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం రోడ్లను నిర్మించాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు



