తెలంగాణ
నేటితో ముగియనున్న కులగణన సర్వే

Telangana: తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వేలో పాల్గొనాలన్నారు. కుల గణన సర్వే నేటితో ముగుస్తుండటంతో ఇంకా సర్వే లో పాల్గొనని వారు, ఎన్యుమారెటర్లకు వివరాలు ఇవ్వాలని అన్నారు. కుల గణన లో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చిందన్నారు.
సర్వే గడువు నేటితో గడువు ముగుస్తుందన్న మంత్రి సర్వే లో పాల్గొనాలన్నారు. తాము కుల సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వచ్చి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ లలో వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.