ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో,అధికారులు మరో గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం రెండు గేట్ల ద్వారా సాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌కు నీటి విడుదల సాగుతోంది.
జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం లక్షా 27వేల 392 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. అదే సమయంలో, శ్రీశైలం నుంచి ఔట్‌ఫ్లో పరిమాణం లక్షా 40 వేల 9 క్యూసెక్కులుగా ఉంది. ఈ మొత్తంలో, రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 53 వేల 764 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.