తెలంగాణ
Hyderabad: కోర్టు మెట్లెక్కిన పందెం కోడి..

Hyderabad: ఓ పందెం కోడివివాదం ఏకంగా కోర్టుకు ఎక్కింది. సంక్రాంతి పండుగ రోజు పోలీసులకు పట్టుబడ్డ పందెం కోడి ఏం చేయాలన్న పంచాయితీని తేల్చేందుకు కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది. రాజేంద్ర నగర్ పోలీసులకు సంక్రాంతి సందర్భంగా పట్టుబడిన పందెం కోడిని పోలీసులు రాజేంద్ర నగర్ కోర్టులో ప్రవేశ పెట్టారు.
పందెం కోడి పంచాయితీ వాదనలు విన్న జడ్జి దానిని వేలం వేయాలని నిర్ణయించారు. జడ్జి సమక్షంలో పందెం కోడిని వేలం వేయగా.. తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ పందెం కోడిని 2వేల 500లకు సొంతం చేసుకున్నారు.