ఆంధ్ర ప్రదేశ్
Visakha: హోటల్‌లో అగ్ని ప్రమాదం

Visakha: విశాఖ గాజువాక రాజీవ్ నగర్ సమీపంలోని రాజభోగం అనే హోటల్ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా టపాసుల తరజువ్వలు గుడిసెపై పడడంతో మంటలు అంటుకున్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు. ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటల ధాటికి గుడిసె పై కప్పు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



