తెలంగాణ
సృష్టి కేసులో నమ్రతా బెయిల్ పిటిషన్ కొట్టివేత

సృష్టి కేసులో నమ్రతా బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. నమ్రత నుండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందన్నసిట్ అధికారులు తెలిపారు. నమ్రత ఆస్తులపైన విచారణ జరపాల్సి ఉందని సిట్ వాదించింది.
నమ్రతా కంపెనీలపైనా దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. మరోవైపు తన కుమారుడు పెళ్లి ఉందని నమ్రత కోర్టుకు తెల్పింది. కుమారుడి పెళ్లి కార్డును సైతం నమ్రత న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది.



