జాతియం
Income Tax Bill: నేడు లోక్‌సభ ముందుకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు

Income Tax Bill: నేడు లోక్‌సభ ముందుకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు రానుంది. గతేడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న.. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ద్వారా పన్ను చట్టాల భాషను సరళీకృతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దీనిని పార్లమెంట్ ఆర్థిక స్థాయి సంఘానికి పంపుతారు.
పన్నుల భాషను సరళీకరించడం వల్ల చట్టాలు సంక్షిప్తంగా, స్పష్టంగా మరియు సులభంగా అర్థం చేసుకోగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది వివాదాలు, వ్యాజ్యాలను తగ్గిస్తుందని, పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ పన్ను ఖచ్చితత్వాన్ని అందిస్తుందని చెప్పుకొచ్చారు అధికారులు.