సినిమా
Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’ రిలీజ్‌కు రెడీ… నవ్వులు గ్యారంటీ

Sarangapani Jathakam: ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సారంగపాణి జాతకం. ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ నవ్వుల తుఫాన్ సృష్టిస్తోంది. జాతకాన్ని నమ్మే హీరో ప్రియదర్శి జీవితంలో వచ్చే సమస్యలు, ప్రేమలో అడ్డంకులు, వాటిని ఎలా దాటాడనే ఫన్ కాన్సెప్ట్‌తో సినిమా ఆకట్టుకుంటోంది.
ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష కామెడీ టైమింగ్ ట్రైలర్‌ను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రైడ్‌గా మార్చింది. వివేక్ సాగర్ సంగీతం సినిమాకు బిగ్ ప్లస్. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం కామెడీ, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ముంచెత్తడం ఖాయం.