ఆంధ్ర ప్రదేశ్
కావలిలో ప్రాణాలకు తెగించిన ఎమ్మెల్యే.. రోడ్డుపై పడ్డ విద్యుత్ వైర్లు తొలగించిన కృష్ణారెడ్డి

నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే ప్రాణాలకు తెగించి మరీ పని ముగించారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పలు అభివృద్ది పనులు ముగించుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడిఉన్నాయి. అయితే హుటాహుటిన కారు దిగి వైర్లను తాళ్లతో కట్టి రోడ్డు పక్కకి పడేశారు.
ఆ సమయంలో విద్యుత్ వైర్లలో విద్యుత్ సరఫరా అయింది. అయితే ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎమ్మెల్యే ధైర్యసాహసాలు చేశారు. అనంతరం విద్యుత్ సిబ్బందిని పిలిపించి మరమ్మతులు చేయించారు. ఎమ్మెల్యే పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.