Arjun S/O Vyjayanthi: అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఇదే

Arjun S/O Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జోడీగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. 25 ఏళ్ల క్రితం విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’లో పోలీస్ ఆఫీసర్ వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య ఎమోషనల్ బంధాన్ని చూపిస్తూ సినిమాపై హైప్ పెంచింది.
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రం ఏప్రిల్ 18న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజైన పోస్టర్లో కళ్యాణ్ రామ్ మెట్లపై కమాండింగ్ పోజ్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని టాక్. సమ్మర్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.