ఆంధ్ర ప్రదేశ్
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు మాధవరెడ్డి అరెస్ట్

Madhav Reddy: మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకొని మాధవరెడ్డి అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నాడు. సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు అయ్యేలా చేశారు.
దీంతో ఓ ఫామ్‌హౌస్‌లో ఉన్న మాధవరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో మాధవరెడ్డి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డిని అదుపులోనికి తీసుకుని తిరుపతికి తరలించారు.