తెలంగాణ
Aadi Srinivas: ఇప్పటికైనా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు మానుకోవాలి

Aadi Srinivas: బీఆర్ఎస్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బరితెగించి ముందుకు పోతుందన్నారు ఆది శ్రీనివాస్. ప్రెస్ మీట్ లో అధికారుల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారని అన్నారు.
కలెక్టర్ పై ఎలాంటి కేసు లేదని తాను మీడియాలో చూసినట్టు చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. లేని కేసులతో అవమానపరిచినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆధికారులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు.