Donald Trump: టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాల్ని మరోసారి హెచ్చరించారు. తాము విధించిన టారిఫ్‌ల నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. అంతేకాదు సుంకాల నుంచి చైనా అసలే తప్పించుకోలేదని వెల్లడించారు ఆయన. మిగితా దేశాలకు 90రోజుల విరామం తాత్కాలికమేన్న ట్రంప్ ఏ దేశానికి మినహాయింపు ఉండబోదని మరోసారి కుండబద్ధలు కొట్టారు.
ముఖ్యంగా అసంబద్ధమైన వాణిజ్య మిగులు, నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికి మినహాయింపు లభించదని తేల్చేశారు. చాలా కాలంగా తమతో చైనా చెత్తగా ప్రవర్తి స్తోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.
రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్‌లో సెమీకండెక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్ సామగ్రిని పరిశీలిస్తున్నామన్నారు ట్రంప్. దీనిని బట్టి దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని తేలిసినట్లు చెప్పారు. అప్పుడే తాము చైనా చేతిలో బందీగా మారకుండా ఉంటామన్నారు ట్రంప్.
ముఖ్యంగా చైనా అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతీ అవకా శాన్ని వాడుకొంటోందని మండిపడ్డారు. దానిని తాము కొనసాగనీయమన్నారు ట్రంప్. ఆ రోజులు కూడా ముగిశాయంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు అమెరికాకు స్వర్ణయుగం మొదలైందన్నారు.