అంతర్జాతీయం
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొలంబియా చర్యలకు.. కౌంటర్ అటాక్ ఇచ్చాడు. కొలంబియా దుందుడుకు చర్యలకు బ్రేకులు వేశాడు. కొలంబియాపై సుంకాలు విధించి.. ఆంక్షలను మరింత కఠినతరం చేశాడు. అయితే ఇది ఆరంభమేనంటూ కొలంబియాను హెచ్చరించారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చే వలసదారుల విమానాలను.. అనుమతించబోమని కొలంబియా తేల్చి చెప్పింది.
అంతేకాదు.. అమెరికా వస్తువులపై 25శాతం సుంకాలను విధించింది కొలంబియా. దీంతో ప్రతిచర్యగా కొలంబియా ఉత్పత్తులపై 50శాతినికి సుంకాలను పెంచారు ట్రంప్. ముఖ్యంగా అమెరికా విమానాలను తిప్పికొట్టడంపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు.