తెలంగాణ
Ponguleti: పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం

Ponguleti: ఖమ్మం జిల్లా మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యమని, అర్హులైన ప్రతిఒక్కరికీ న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే ఇళ్ల పంపిణీ ప్రక్రియ మొదలైందన్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం చేకూరే అనేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.