ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాళహస్తి తహశీల్దార్ ఆఫీస్‌లో ఏసీబీ దాడులు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేపట్టారు. ఏసీబీ అధికారి విమల కుమారి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మండల సర్వేర్ పురుషోత్తం రైతు నుంచి 25వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. లంచం తీసుకున్న పురుషోత్తంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.