తెలంగాణ
అంబర్పేట్ ఫ్లైఓవర్‌పై రాకపోకలు ప్రారంభం

Amberpet: అంబర్పేట్ ఫ్లైఓవర్‌పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తిచేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు.
అంతవరకు ప్రయాణికుల సౌకర్యం కోసం శివరాత్రి పర్వదినాన ఫ్లైఓవర్ ప్రారంభిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నారు.