Balakrishna: హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్

Balakrishna: హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో.. కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు NRI దంపతులు సుద్నగుంట కళ్యాణి, ప్రసాద్ 10 కోట్ల విరాళాన్ని అందించారు. హాస్పిటల్ స్థాపన వెనుక ఉన్న ఆశయాలను, దాని ప్రస్తుత విజయాలను బాలకృష్ణ వివరించారు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ చికిత్సను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోందన్నారు. కొత్త ఏడాదిలో కొత్త రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, క్యాన్సర్ పరిశోధనలను మరింత అభివృద్ధి చేయడం ఒక శుభారంభమని బాలకృష్ణ తెలిపారు. దేశంలో క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.