ఆంధ్ర ప్రదేశ్
Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

Encounter: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ ఉదయం పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ అగ్రనేత హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో, అధికారులు పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు ఏవోబీ ప్రాంతంలో విస్తృత నిఘా పెట్టి, వాహనాల తనిఖీలు చేపట్టి, అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.



