తెలంగాణ
Miss World: నేడు పిల్లలమర్రి,ఏఐజీకి ప్రపంచ సుందరీమణులు

Miss World: ప్రపంచ సుందరీమణులు నేడు మూడు బృందాలుగా ఏర్పడి మూడు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వైద్య పర్యాటకంలో భాగంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని, మహబూబ్‌నగర్ జిల్లాలోని చరిత్రాత్మక పిల్లలమర్రిని, హైదరాబాద్ శివారులోని ఎక్స్‌పీరియం ఎకోటూరిజం పార్క్‌ను ఈ బృందాలు సందర్శిస్తాయి.
40 మంది అతివల బృందం ఇవాళ పది గంటలకు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని దేశ, విదేశీ రోగులకు అందిస్తున్న వివిధ చికిత్సల గురించి తెలుసుకుంటారు. ఏఐజీ వ్యవస్థాపకులు, ఇతర వైద్య నిపుణులు.. తమ ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సలు, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్యం, బ్యూటీ, హెల్త్‌కేర్, ఫిట్‌నెస్, డైట్ కార్యక్రమాలపై వివరించనున్నారు.