H-1B వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లుగా నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస నియంత్రణ చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఉద్యోగి తరఫున స్పాన్సర్ కంపెనీ లక్ష డాలర్లు అంటే సుమారుగా 90 లక్షలు ఫీజును నిర్ధారించే బిల్లుపై సంతకం చేశాడు. ఈ నిర్ణయంతో ఇండియా, చైనా నుంచి నిపుణులైన కార్మికులపై ఆధారపడే అమెరికా టెక్ రంగానికి ఇబ్బందికరంగా మారనుంది. అసలు H-1B వీసా అంటే ఏమిటి అవును దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం H-1B అనేది తాత్కాలిక అమెరికా వర్క్ వీసా.
1990లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీలు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవచ్చు. వీసా మొదట మూడు సంవత్సరాల పాటు మంజూరు అవుతుంది. గరిష్టంగా ఆరు సంవత్సరాల వరకు పొడిగిస్తారు. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి కంటిన్యూగా పునరుద్ధరించడానికి కూడా అవకాశం ఉంది. సాధారణంగా అమెరికా సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ USCIS లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వీసా పొందిన వారికి అమెరికన్ ఉద్యోగులతో సమాన వేతనం, పని పరిస్థితులు కల్పించాలని చట్టం చెబుతుంది.
ప్రకటనపై సంతకం చేసిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ మాకు గొప్ప కార్మికులు అవసరం, కానీ అమెరికన్లకు ఉద్యోగాలు కావాలన్నాడు. అమెరికా యువతను రక్షించాలన్నారు. దేశంలోకి వచ్చే విదేశీయులు నిజంగా అత్యున్నత నైపుణ్యంతో ఉన్నారని నిర్ధారించడమే లక్ష్యమని ట్రంప్ చెప్పాడు. H-1B అత్యంత దుర్వినియోగం చేయబడిన వీసా కార్యక్రమాల్లో ఒకటని అందుకే ఫీజును గణనీయంగా పెంచాలని నిర్ణయించామన్నాడు వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ఫ్. కొత్త ఫీజు వల్ల కంపెనీలు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు ఒక కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
దీంతో మధ్యస్థ, జూనియర్ స్థాయి నియామకాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. వీసా పునరుద్ధరణ ప్రతిసారి ఈ భారీ ఫీజు చెల్లించాల్సి రావడం ఆర్థిక భారాన్ని పెంచుతుంది. గ్రీన్ కార్డ్ కోసం ఇప్పటికే సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితితో ఈ మార్పు అమెరికాలో స్థిరపడాలనుకునేవారి, ఉండాలనుకునేవారికి ఇబ్బంది కలిగిస్తుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా టెక్ కంపెనీలన్నీ H-1B వీసాదారులను తక్షణం అమెరికా వచ్చేయాల్సిందిగా ఆదేశించాయి. అమెజాన్, జేపీ మోర్గాన్‌తోపాటుగా పలు కంపెనీలు ఉద్యోగులకు అడ్వైజరీలు జారీ చేశాయి.
ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను, H1B వీసాలు దక్కించుకున్న సంస్థల్లో అమెజాన్ అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సంస్థలున్నాయి. ఈ పరిమితులు 12 నెలల పాటు కొనసాగుతాయి. ట్రంప్ పరిపాలన సెప్టెంబర్ 21, 2025 నుండి అమలులోకి వచ్చే అధ్యక్ష ప్రకటన ద్వారా H-1B వీసా పథకానికి గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ చొరవ కార్యక్రమం విస్తృత దోపిడీని లక్ష్యంగా చేసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం H-1B వీసా లబ్ధిదారుల్లో 71 శాతం మంది భారతీయులే.
చైనా 11.7 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. అమెజాన్, AWS, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ప్రతి సంవత్సరం వేలాది భారతీయులను ఈ వీసా ద్వారా నియమించుకుంటున్నాయి. జూన్ 2025 నాటికి అమెజాన్ 10,044 H-1B వీసా ఆమోదాలతో ముందుండగా, TCS 5,505 ఆమోదించబడిన వీసాలతో రెండో స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ 5,189 మెటా 5,123 ఆమోదాలతో ఉన్నాయి. ఆపిల్ 4,202 వీసాలను పొందగా, గూగుల్ 4,181 వీసాలను పొందింది. డెలాయిట్ 2,353 ఆమోదాలను పొందగా, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా అమెరికా 951 వీసాలు పొందాయి. ప్రస్తుత H-1B వీసా దరఖాస్తు ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం వాటి ధరలు 1700 నుంచి 4,500 డాలర్ల మధ్య మారుతూ ఉన్నాయి. వేగంగా వీసా కావాలంటే, అధిక మొత్తంలో ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. H-1B వీసాల కోసం యజమానులు ప్రస్తుతం చెల్లించాల్సిన 4,500 డాలర్ల ఫీజు ప్రస్తుతం తాజా నిర్ణయం 22.2 రెట్లు అంటే లక్ష డాలర్లకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఆ మొత్తం 90 లక్షలవుతుంది. ట్రంప్ తాజా నిర్ణయం తాత్కాలికంగా వలసలను తగ్గించవచ్చుగానీ, అమెరికా టెక్ రంగం నైపుణ్య లోటును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతీయులు ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్, డేటా సైన్స్ రంగాల్లో ఎక్కువగా ఉన్నందున, కంపెనీలు ఫీజు భారాన్ని భరించలేక నియామకాలను నిలిపేయవచ్చు. నైపుణ్యం ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్‌కే అవకాశాలు లభించవచ్చు.



