జాతియం
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా కోసం ముమ్మర ఏర్పాట్లు..

Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరగనుంది. 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళాకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పరిశుభ్రత కోసం అధునాతన పరికరాలను ఉపయోగించనున్నారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఘాట్‌లు సిద్దం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమస్థలంలో కుంభమేళా జరగనుంది. భద్రతా కోసం ప్రభుత్వం 40 వేల మందికి పైగా పోలీసులు ఉపయోగించనుంది. మరోవైపు.. AIతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి, డ్రోన్ల ద్వారా అనుక్షణం పర్యవేక్షణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.