ఆంధ్ర ప్రదేశ్
Tirupati: ఎట్టకేలకు చిక్కిన చిరుత

Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో బోనులో చిక్కిన చిరుత. గత కొద్ది రోజుల క్రితం అలిపిరి చెర్లోపల్లి మార్గంలో టూవీలర్ మీద వెళ్తున్న ఇద్దరిపై దాడి చేసిన విషయం తెలిసిందే అప్పటినుంచి చిరుతను బంధించేందుకు ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు చోట్ల బోనులు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
అయితే తాజాగా ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఎస్ వి యూనివర్సిటీ ఎడి బిల్డింగ్ వెనుక భాగంలో ఉంచిన బోనులో చిరుత చిక్కింది. దీనిని అటవీ ప్రాంతంలో వదిలేందుకు అటవీశాఖ అధికారులు తీసుకువెళ్తున్నారు.



