Raju Weds Rambai: రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్‌కు ప్రశంసల వర్షం

Raju Weds Rambai: తాజాగా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా భలే హంగామ చేస్తోంది. అసలు కాన్సెప్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడా రొటీన్ గా లేకుండా ఆకట్టుకుంటోంది. రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజును మించాయి.
ఇటీవల విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తోంది. సాధారణ లవ్ ఎంటర్‌టైనర్ అనుకున్నవారికి ఈ చిత్రం భారీ షాకిచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి నెట్టింటా భారీ చర్చ జరుగుతుంది. ఇటీవలి భారతీయ సినిమాల్లోనే అత్యంత హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.
కాన్సెప్ట్ పూర్తిగా బాక్స్ వెలుపల ఉండటంతో పాటు దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. దీంతో ఈ చిత్రం రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజును దాటేశాయి. థియేటర్లలో సూపర్ సాలిడ్ మౌత్ టాక్ నడుస్తోంది. ఇలాంటి ధైర్యమైన ప్రయత్నాలు ఎక్కువ మంది దర్శకులు చేయాలని సినీ ప్రముఖులు సైతం కోరుతున్నారు.



