తెలంగాణ
Road Accident: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో యువతి డ్రైవింగ్

Road Accident:హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగం.. అజాగ్రత్తతో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్థంభం దిమ్మెను ఢీకొని కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులోని డ్రైవింగ్ సీటులో ఇరుక్కుని గాయపడ్డ యువతిని కారు అద్దాలు పగులగొట్టి బయటకు లాగారు. ఆమె మెడికో డాక్టర్ గా ఫిలింనగర్ పోలీసులు గుర్తించారు.ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఫుల్లుగా మద్యం మత్తులో యువతి ఉందని స్థానికులు చెప్తున్నారు.



