ఆంధ్ర ప్రదేశ్
నేడు విజయవాడ, విశాఖ మెట్రో రైల్కు టెండర్లు

విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్కు రంగం సిద్ధం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం నేడు టెండర్లు పిలిచింది. 21వేల 616 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు. విజయవాడ మెట్రో రైలుకు 10వేల118 కోట్లు, వైజాగ్ మెట్రోకు 11వేల 498 కోట్ల టెండర్లు కేటాయించనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధుల భాగస్వామ్యంతో విజయవాడ, వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభం కానుంది. వైజాగ్ మెట్రో రైలుకు వీఎంఆర్డీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా గా 4వేల101 కోట్లు నిధులు మల్లించనున్నారు. విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి 3వేల497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నిధులు ఏర్పాటు చేయనున్నారు.