తెలంగాణ
Harish Rao: వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైరయ్యారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. అకాల వర్షాల భయంతో రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే దళారులకి అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.