తెలంగాణ
Dundra Kumaraswamy: జైపాల్ రెడ్డి సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత

Dundra Kumaraswamy: సామాజిక న్యాయస్ఫూర్తిదాత జైపాల్ రెడ్డి 6 వ వర్థంతిని PVNR మార్క్ నెక్లెస్ రోడ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి ఈ తరానికి, మరెన్నో తరాలకు ఆదర్శం, స్ఫూర్తి అన్నారు. పుట్టుకతో ఉన్నతవర్గానికి చెందినవాడైనా, జీవితాంతం సమ సమాజాన్ని ఆకాంక్షించిన దార్శనికుల్లో రాజకీయ ప్రముఖుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు.
స్వర్గీయ జైపాల్ రెడ్డి కేంద్ర పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ బంక్‌లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మండల కమిషన్ నివేదికతో వి.పి. సింగ్ ప్రభుత్వం బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లను ప్రవేశపెట్టినపుడు, నాటి ప్రభుత్వంలో జైపాల్ రెడ్డి సేవలు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయని దుండ్ర కుమారస్వామి గుర్తుచేశారు.



