తెలంగాణ
Hyderabad: కూకట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరికి తీవ్రగాయాలు

Hyderabad: కూకట్ పల్లి బాగ్ అమీర్లో పేలుడు సంభవించింది. జయ భవాని గోల్డెన్ ఇన్ఫోసిస్టమ్ ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. డొమొస్టిక్ సిలిండర్ నుండి అక్రమంగా చిన్న సలిండర్ లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.
ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పేలుడు ధాటికి షాపు మొత్తం శిథిలమైంది. గాయపడిన వ్యక్తిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నివాసాల మధ్య ఇలాంటి ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.