తెలంగాణ
Siddipet: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

Siddipet: ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఐదు నెలల క్రితం అలిరాజపేట గ్రామానికి చెందిన ఫరీద్తో సదా అఫ్రీన్కు వివాహం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. బుధవారం భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తమ కుమార్తే మృతికి వరకట్న వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



