సినిమా

Puri Jagannadh: పూరి సినిమాలో నిహారిక

Puri Jagannadh: పూరి జగన్నాధ్, విజయ్ సేతుపతి కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రంలో సంచలనం యాడ్ అవుతుంది. ఈ సినిమాలో నిహారిక ఎన్ఎం కీలక పాత్రలో నటించబోతుంది.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్, వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తుండగా, తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి నిహారిక ఎన్ఎం ఈ ప్రాజెక్ట్‌లో చేరారు.

‘పెరుసు’ చిత్రంలో తన నటనతో మెప్పించిన నిహారిక, ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారనే ఆసక్తి నెలకొంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి, ఛార్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సంచలనాత్మకంగా రూపొందుతోంది. పూరి దర్శకత్వం, విజయ్ సేతుపతి నటనతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని అభిమానులు ఆశిస్తున్నారు. నిహారిక పాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button