Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా తిరునల్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న అన్నామలై స్థానంలో నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయన నియామకం ఖాయమైంది. నాగేంద్రన్ పేరును అన్నామలై ప్రతిపాదించగా, పార్టీ ఇతర నేతలు బలపరిచారు. కాగా, నాగేంద్రన్ నియామకానికి సంబంధించిన అధికారికంగా ప్రకటించనున్నారు.
నైనార్ నాగేంద్రన్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. తొలుత ఆయన అన్నాడీఎంకేలో పనిచేశారు. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో నైనార్ నాగేంద్రన్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీనగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. ఆయన పేరును బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్, ప్రతిపాదించారు.పార్టీ అధ్యక్షుడి రేసులో తాను లేనని అన్నామలై ఇప్పటికే ప్రకటించారు.