చైతూ కోసం మహేష్!

అక్కినేని నాగ చైతన్య కొత్త సూపర్ నాచురల్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ కానుంది. గ్లోబ్ ట్రాటర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పోస్టర్‌ను విడుదల చేస్తారు. రేపు ఉదయం 10:08కి లాంచ్ నిర్ణయమైంది. ఈ సినిమా టైటిల్ కూడా రేపే తెలుస్తుంది.
తండేల్‌తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన తదుపరి చిత్రంతో మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ సూపర్ నాచురల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను రేపు గ్రాండ్‌గా రివీల్ చేయనుండటం స్పెషల్.
ఈ లాంచ్ బాధ్యతను సూపర్‌స్టార్ మహేష్ బాబు తీసుకున్నారు. రేపు 10 గంటల 8 నిమిషాలకు మహేష్ స్వయంగా ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతూ కెరీర్‌లో మరో మైలురాయి కానున్న ఈ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



