సినిమా
డేటింగ్: దొరికిపోయిన మీనాక్షి-సుశాంత్ ?

Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి చుట్టూ సోషల్ మీడియాలో గాసిప్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అక్కినేని హీరో సుశాంత్‌తో ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన ఈ బ్యూటీ డేటింగ్ రూమర్స్‌ను రేకెత్తిస్తోంది. నిజమా, అబద్ధమా? పూర్తి వివరాలు చూద్దాం.
మీనాక్షి చౌదరి, సుశాంత్‌ల మధ్య డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. 2021లో “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమా సమయంలోనే ఈ గుసగుసలు మొదలయ్యాయి. మీనాక్షి లక్కీ భాస్కర్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
ప్రస్తుతం నాగచైతన్య సరసన NC 24లో నటిస్తున్నారు. గతంలో సుశాంత్‌తో రూమర్స్‌ను ఆమె ఖండించి, అతను కేవలం స్నేహితుడని చెప్పారు. అయినా, ఈ తాజా వీడియోతో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. నెటిజన్లు వీరి బంధంపై ఆసక్తిగా చర్చిస్తున్నారు.



