తెలంగాణ
Pareshan Boys Imran: అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్రాన్

Pareshan Boys Imran: ఇన్‌స్టాలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘నా అన్వేషణ’ పేరుతో ట్రావెలింగ్ చేసే అన్వేష్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అమ్మను ఉద్దేశిస్తూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరూ మాట్లాడలేని విధంగా తన అమ్మపై అసభ్యకరంగా అన్వేష్ ఆరోపణలు చేశాడని ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ని సోషల్ మీడియా వేదికగా కోరాడు. అన్వేష్‌పై కూడా చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని వీడియోలో వివరించాడు. అంతేకాదు వ్యక్తిగతం గా, కుటుంబసభ్యులపై ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశాడు ఇమ్రాన్. కాగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తర్వలోనే ఇమ్రాన్‌ను విచారించే అవకాశం ఉంది.