తెలంగాణ
Hayathnagar: ఆర్‌ఎన్‌ఆర్ కాలనీలో అగ్నిప్రమాదం 10 గుడిసెలు దగ్ధం

Hayathnagar: హైదరాబాద్ హయత్‌నగర్ ఆర్ఎన్ఆర్ కాలనీలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో 10 గుడిసెలు దగ్ధం అయ్యాయి. వరుస అగ్నిప్రమాదాలతో కాలనీవాసుల ఆందోళన చెందుతున్నారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.