ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా పులిచెర్లలో గజరాజుల హల్‌చల్

చిత్తూరు జిల్లా పులిచెర్లలో గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. మామిడి, అరటి, టమోటా తోటలను తొక్కి నాశనం చేస్తు న్నాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
అటు పొలాలకు వెళ్లేందుకు అన్నదాతలు భయపడుతున్నారు. ఏక్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.