తెలంగాణ
Road Accident: కల్వర్టును ఢీకొట్టిన బైక్ .. ఇద్దరు మృతి

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంధువులకుపెండ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో పెళ్లి కొడుకు, అతని స్నేహితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతులు ఇంధన్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్, జస్వంత్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.