జాతియం
Gas Cylinder Price: సామాన్యులకు మరో షాక్.. భారీగా గ్యాస్ ధరలు పెంపు

Gas Cylinder Price: సామాన్యులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఓ వైపు ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న జనం నెత్తిన మరోసారి భారం మోపాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒకేసారి రూ.50 ధరను పెంచాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎల్‌పీజీ ధరలను రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఉజ్వల, సాధారణ కేటగిరీ వినియోగదారులకు గ్యాస్ ధరను పెంచినట్లు మంత్రి ప్రకటించారు. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ ధర 803 నుంచి 853కి పెరగనున్నది. ఇక ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు సిలిండర్ ధర 503 నుంచి 553కి చేరనున్నది. పెరిగిన సిలిండర్ ధరలు ఈనెల 8 నుంచి అమలులోకి రానున్నాయి.