తెలంగాణ
భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా 7వ రోజు స్వామివారు శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామావతారంలో ఉన్న స్వామివారిని మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. సూర్య గ్రహ బాధలున్నవారు రామావతారాన్ని దర్శించడం వలన ఆ బాధల నుండి విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం.



