పోస్ట్ ఆఫీస్ పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు అమ్మకం

పోస్ట్ ఆఫీస్ పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు అమ్మిన ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా కిషన్ నగర్ గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా పాస్ పుస్తకాలు పోస్ట్‌మ్యాన్ రామ్ జీ అమ్మినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పుస్తకాలు కొంటేనే పెన్షన్ ఇస్తారని.. తమకు పోస్ట్‌మ్యాన్ హుకుం జారీ చేశారని పింఛను దారులు ఆరోపిస్తున్నారు. పాస్ పుస్తకం పేరుతో ఒక్కొక్కరిదగ్గర డబ్బులు వసూళ్లు చేసినట్లు సమాచారం.
మరోవైపు ప్రభుత్వం ఇచ్చే మొత్తం పింఛను తమకు అందటం లేదని పింఛను దారులు వాపోతున్నారు. అలాగే పెన్షన్ డబ్బులతో తమ అనుమతి లేనిదే.., ఇంటి పన్ను కట్టుకుంటు న్నారని బాధితులు చెబుతున్నారు. అదేవిధంగా పోస్ట్‌మ్యాన్ రామ్ జీ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు బాధితుల ఆరోపిస్తున్నారు. ఏదీఏమైనా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ నగర్ గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.