ఆంధ్ర ప్రదేశ్
Avinash Reddy: రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది

Avinash Reddy: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి కడప జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభలో ప్రస్తావించారు.
రైతులకు ఏడాదికి 20 వేలు ఇస్తామన్న హామీని.. ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ను 7 గంటలకే పరిమితం చేసే ప్రయత్నంలో ఉన్నారని.. అలా చేస్తే రైతులతో కలిసి ఆందోళన బాటపడతామని హెచ్చరించారు అవినాష్ రెడ్డి.