తెలంగాణ
Hyderabad: దారుణం.. తల్లీకొడుకులపై కత్తితో దాడి

Hyderabad: సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణం చోటుచేసుకుంది. మెట్టుగూడ సర్కిల్ దగ్గర బైకుపై వెళ్తున్న తల్లీకొడుకులపై దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో.. కుమారుడు యశ్వంత్, తల్లి రేణుకకు తీవ్రగాయాలయ్యాయి. గాంధీ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఐదుగురు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.