తెలంగాణ
హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జవహర్ కాలనీ ఎస్వీఎస్ యాంపిల్ హోమ్స్ వద్ద ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న లేబర్ షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



